ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఉద్యోగులారా మీరు చేసే యుద్దంలో మేమే ముందుంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్,అర్జున్ సమాచారం:
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రాఫర్లను సన్మానించిన కేంద్ర మంత్రి
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 27 నుండి ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన పోరుబాటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే యుద్దంలో బీజేపీ సైనికులే ముందుండి పోరాడేందుకు సిద్ధమన్నారు. ఈ యుద్దంలో మీ కంటే ముందు మేమే ఉంటాం. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఆ దెబ్బలు మేమే తింటాం. తూటాలు పేలిస్తే ఆ తూటాలకు మేమే బలయ్యేందుకు సిద్ధం అని భరోసా ఇచ్చారు. జేఏసీలో ఒకరిద్దరు నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఉద్యమాన్ని వాయిదా వేయడం పరిపాటిగా మారిందని, అట్లాంటి వాళ్లను ఇకపై జేఏసీలో కొనసాగించవద్దని కోరారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్  ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గ్రుహంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. సమాజానికి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం తదితరులతో కలిసి ఉద్యోగుల జేఏసీ పోరుబాటుకు మద్దతుగా మాట్లాడారు.
కరీంనగర్ డెయిరీ విషయంలో రాజకీయ కోణంలో చూడొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. సాఫీగా సాగుతున్న కరీంనగర్ డెయిరీ ని దెబ్బతీసి వాళ్ల ఆస్తులపై కన్నేయడం సరికాదు. లక్షలాది మంది రైతులకు మేలు చేసే సంస్థ. కక్ష సాధింపు చర్యలు సరికాదు. ఏదో ఒక పేరుతో బాగా నడిచే కరీంనగర్ డెయిరీని అప్రదిష్టపాల్జేసి రైతులకు అన్యాయం చేయాలని చూడటం దుర్మార్గం. ఒక వ్యక్తిని లక్ష్యం చేసుకుని వ్యవస్థను దెబ్బతీయడం దారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రత్యేకంగా ఈ డెయిరీపై ద్రుష్టి పెట్టాలి. న్యాయం చేయాలి. ప్రభుత్వం పక్షాన సాయం చేయకపోయినా ఫరవాలేదు దయచేసి అన్యాయం చేయొద్దని కోరుతున్నా.
===========================